Friday, 30 May 2014

ఆంధ్ర డిప్యూటీ సీఎంగా నారాయణ!

ఆంధ్ర డిప్యూటీ సీఎంగా నారాయణ!
Seema Andra













 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమిస్తానని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు అందులో ఒకరు నారాయణ విద్యాసంస్థల యజమాని పి.నారాయణ పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని చంద్రబాబు సన్నిహితులు ధ్రువీకరించారు. బాబు సన్నిహితుల్లో ఒకరైన నారాయణ ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కారు.

 కాపు సామాజికవర్గానికి చెందిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో పార్టీ తరపున ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతను తీసుకున్నారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ సభలో సభ్యుడు కాని వ్యక్తి సీఎం, డిప్యూటీ సీఎం లేదా మంత్రి బాధ్యతలు చేపడితే ఆరు నెలల్లోగా ఎగువ, దిగువ సభల్లో ఏదో ఒక దానిలో సభ్యుడు కావాలి. దీంతో ఆయన్ను గవర్నర్ కోటాలో లేదంటే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా పంపే అవకాశముంది

No comments: